![రామలింగేశ్వర సిద్దాంతి మృతికి చంద్రబాబు సంతాపం](https://static.v6velugu.com/uploads/2022/01/Chandrababu-Tribute-the-death-of-Mulugu-Ramalingeswara-Siddhanti_jOVZqwhBQL.jpg)
హైదరాబాద్: ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రామలింగేశ్వర సిద్దాంతి మృతి బాధాకరమని అన్నారు. ప్రముఖ పంచాగ కర్తగా ఆయన అందరికీ సుపరిచితమన్నారు. ములుగు వారి వార ఫలాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రామలింగేశ్వర సిద్దాంతి అత్యంత సుప్రసిద్ధులని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో..రామలింగేశ్వర సిద్దాంతి తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా పండరీపురం గ్రామంలో జన్మించిన ములుగు.. పంచాంగ శ్రవణం, రాశిఫలాలు, జ్యోతిష ఫలితాలను తెలుపడంలో ఖ్యాతి గడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా జ్యోతిష రంగానికి సేవలందించారు.