AP News: అచ్యుతాపురం సెజ్​ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

విశాఖలోని మెడికోవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు ఇచ్చామని అధైర్య పడొద్దని కోలుకుంటారని వాళ్లకు భరోసా ఇచ్చారు. ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి వారి పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. అనంతరం బాధిత ఫ్యామిలీలతో కూడా మాట్లాడారు. 

అచ్యుతాపురంలో ఫార్మా ప్రమాదంలో  చనిపోయినవారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు .... తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక లక్షల పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని మరో 36 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందజేస్తామని వెల్లడించారు. 

 ప్రమాదంలో గాయపడిన  వారితో మాట్లాడానని సీఎం చంద్రబాబు తెలిపారు.  .. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చానన్నారు.  . ఎన్నిరోజులైనా పర్వాలేదు ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందన్నారు.  గాయపడిన వారిలో   ఒకరికి 57 శాతం కాలిన గాయాలయ్యాయి. . మరొకరికి 24 శాతం, ఇంకొకరికి 12 శాతం, మరొకరికి 10 శాతం కాలిన గాయాలయ్యాయి. ఒకరు ప్రమాదం జరిగిన షాక్ లో ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు.  ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్నివిధాల ప్రభుత్వమే ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 
అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు చంద్రబాబు