ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది, ఫలితాల కోసం అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం ఎంతో శ్రమించిన నేతలంతా ఇప్పుడు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. సీఎం జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.తాజాగా చంద్రబాబు కూడా సతీసమేతంగా అమెరికా వెళ్లారు. జగన్ లండన్ పర్యటన గురించి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హడావిడి క్రియేట్ అయ్యింది. కానీ, చంద్రబాబు అమెరికా పర్యటన గురించి మాత్రం చడీచప్పుడు లేదు.
చంద్రబాబు వైద్య పరీక్షల కోసం శనివారం రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు మెడికల్ టెస్టుల తర్వాత ఆరు రోజుల తర్వాత తిరిగి రానున్నారని సమాచారం. లోకేష్ కూడా ఇటీవలే అమెరికా వెళ్లారు.