
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా పనచేస్తున్నారు శ్రీనివాస్. ఈయన సర్వీసు నింబంధనలను ఉల్లఘించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ డెవలప్ మెంట్ స్కామ్ లో ఇతని పాత్ర ఉందని సీఐడీ ఆరోపిస్తు్ంది. కేసు విచారణ కోసం నోటీసులు ఇవ్వగానే అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమెరికాకు వెళ్లిపోయారు శ్రీనివాస్.
ఈ క్రమంలోనే ఏపీ ప్రణాళిక శాఖ.. పెండ్యాల శ్రీనివాస్‌కు మెమో జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయితే దీనిపై పెండ్యాల శ్రీనివాస్ స్పందించకపోవడంతో.. అతనిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.