రాజమండ్రి జైల్లో తన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీబీ కోర్టు జడ్జికి ఆయన మూడు పేజీల లేఖ రాశారు. 2023 అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. పెన్ కెమెరాతో ఓ రిమాండ్ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడంటూ చంద్రబాబు లేఖలో ఆరోపించారు. తనను చంపుతానంటూ మావోయిస్టుల పేరుతో లేఖ కూడా వచ్చిందన్నారు.
తనను హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాజమండ్రి జైలుపై ఈ మధ్య ఒక డ్రోన్ కూడా తిరిగిందని లేఖలో తెలిపారు బాబు. జైలు, దాని చుట్టు పక్కల భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. తనతో పాటుగా తన కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని లేఖలో పేర్కొన్నారు బాబు.
రాజమండ్రి జైలులో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్న చంద్రబాబు.. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారరని చెప్పారు. తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారని తెలిపారు.. ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారు ఉన్నారని చెప్పారు.