ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలంతా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తుండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు.
కుప్పంలో శ్రీ ప్రసన్నవరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్థానిక మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన భువనేశ్వరి, ఆర్వో కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కుప్పం నుండి భారీ మెజారిటీ సాధించటం చంద్రబాబుకు కీలకంగా మారిందని చెప్పాలి.