కండలవీరుడిగా రాఘవ లారెన్స్ 

డ్యాన్సర్ , నటుడు రాఘవ లారెన్స్ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. చంద్రముఖి 2 సినిమా కోసం కండల వీరుడిగా మారాడు. సూపర్ స్టార్ రజనీకాంత్  నటించిన ‘చంద్రముఖి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దానికి ఇంతవరకూ తమిళంలో సీక్వెల్ తీయలేకపోయారు. రెండో భాగంలో నటించడానికి రజనీ ఆసక్తి చూపించలేదు. ఆ తరహా హారర్ చిత్రాలకు రాఘవ లారెన్స్ బెస్ట్ ఆప్షన్ అని భావించిన మేకర్స్.. అతడితో రెండో భాగం తీయడానికి ముందుకొచ్చారు. 

చంద్రముఖి 2 సినిమాను దర్శకుడు పీ వాసు తెరకెక్కించబోతున్నాడు. ట్విట్టర్ లో రాఘవ లారెన్స్ పోస్ట్ చేసిన  ఫొటోలు వైరల్ గా మారాయి. అందరికీ హాయ్..నేను మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నానని... ముందుగా, 'చంద్రముఖి 2' కోసం తన బాడీని మార్చుకోవడానికి చిన్న ప్రయత్నంచేశారని చెప్పారు.తన బాడీలో ఈ మార్పు తీసుకొచ్చినందుకు  ట్రైనర్ శివ మాస్టర్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

తాజాగా రాఘవ లారెన్స్ .. కండలు తిరిగిన శరీరంతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆయన బాడీకి నెటిజెన్స్ షాకవుతున్నారు.  ‘చంద్రముఖి 2’ చిత్రం కోసమే తాను ఇలా మారానని అది అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానని లారెన్స్ తెలిపారు. కండలు తిరిగిన శరీరంతో హీమేన్ లా కనిపిస్తున్న ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ‘ముని’ సిరీస్, ‘శివలింగ’ చిత్రాల తర్వాత లారెన్స్ మాస్టర్ మరోసారి నటిస్తున్న ఈ హారర్ కామెడీ ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ సినిమాలోని లారెన్స్ మజిల్స్ బాడీ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.