ఎమ్మెల్సీ కవితతో చంద్రశేఖర్‌‌ ఆజాద్‌ భేటీ

ఎమ్మెల్సీ కవితతో చంద్రశేఖర్‌‌ ఆజాద్‌ భేటీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన బీఆర్‌‌ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు కొత్త సెక్రటేరియెట్‌కు ఆయన పేరు పెట్టడం అభినందనీయమని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రెండ్రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. రాజకీయ విధానాలు, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తర్వాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, కొత్త పార్లమెంట్ భవనంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు కేసీఆర్ తమ ఎంపీలను పంపి మద్దతు తెలిపారని గుర్తచేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహ సందర్శనతో పాటు సీఎం కేసీఆర్‌‌ను కలిసేందుకు రావాలని ఆజాద్‌ను ఆహ్వానించామని కవిత తెలిపారు. తర్వాత తెలంగాణ అమరజ్యోతిని సందర్శించి అమర వీరులకు నివాళులర్పించారు. 

ALSO READ:ప్రాణనష్టం జరగకుండా చూడండి.. మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం