సోషల్ మీడియాపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి: చంద్రశేఖర్

సోషల్ మీడియాపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి:  చంద్రశేఖర్

సంగారెడ్డి టౌన్, వెలుగు : సోషల్ మీడియాపై స్పెషల్​ ఫోకస్​ పెట్టి  ఎన్నికలకు సంబంధించిన అంశాలను నిశితంగా పరిశీలించాలని అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లోని ఆయన చాంబర్ లో సోషల్ మీడియా సెల్, ఎంసీఎంసీ, ఎంసీసీ నోడల్​ ఆఫీసర్లు, సహాయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాలను గుర్తించాలని సూచించారు.

అభ్యర్థులు  సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వీడియోలు, ఫొటోలు, వాయిస్ రికార్డ్, మెసేజెస్ ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం  ఉన్నందున నిఘా వేయాలని చెప్పారు. నివేదికలను రోజూ సీఈఓకు పంపాలన్నారు. సమావేశంలో నోడల్ అధికారులు సురేశ్​మోహన్, రాధాబాయి, విజయ లక్ష్మి, ఈడీ ఎం ఉదయ్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ALS0 READ:రాత్రి త్వరగా నిద్ర రావాట్లేదా?