పద్మారావునగర్, వెలుగు: ప్రొఫెసర్నాగేశ్వర్పై ఎంపీ ఈటల రాజేందర్చేసిన వ్యాఖ్యలు జర్నలిజాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ఫెడరేషన్రాష్ట్ర కార్యదర్శి ఇ.చంద్రశేఖర్ ఖండించారు. నాగేశ్వర్‌ను సూడో మేధావి అంటూ కించపరిచేలా మాట్లాడడం ఈటల నీతిమాలిన తనానికి నిదర్శనమన్నారు. ఈటల వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, నాగేశ్వర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రశేఖర్డిమాండ్చేశారు.
40 ఏండ్లుగా తన కలంతో పాటు గళాన్ని వినిపిస్తూ జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి నాగేశ్వర్ అని కొనియాడారు. తన వ్యక్తిగత మనుగడ కోసం పార్టీలు మారే వ్యక్తి ఈటల రాజేందర్అని విమర్శించారు. సిద్ధాంతాలు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చే ఈటల రాజేందరే సూడో పొలిటీషియన్ అని మండిపడ్డారు. ప్రొ.నాగేశ్వర్‌కు ఈటల క్షమాపణలు చెప్పకపోతే జర్నలిస్టులంతా ఐక్యంగా ఆందోళన చేస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.