చీఫ్​ ఇన్ఫర్మేషన్​ కమిషనర్​గా చంద్రశేఖర్​రెడ్డి.. మరో ఏడుగురు సమాచార కమిషనర్లుగా నియామకం

చీఫ్​ ఇన్ఫర్మేషన్​ కమిషనర్​గా చంద్రశేఖర్​రెడ్డి.. మరో ఏడుగురు సమాచార కమిషనర్లుగా నియామకం
  • గవర్నర్​కు చేరిన ఫైల్​.. ఆమోదించగానే ఉత్తర్వులు
  • లిస్ట్​లో అయోధ్య రెడ్డి బోరెడ్డి, పీవీ శ్రీనివాస్​రావు, కప్పర 
  • హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)గా ఐఎఫ్ఎస్​ అధికారి చంద్రశేఖర్​ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సిఫార్సులను గవర్నర్​కు పంపినట్లు తెలిసింది. గవర్నర్​ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సీఐసీతోపాటు  రాష్ట్ర సమాచార కమిషన్‌‌లో ఖాళీగా ఉన్న మరో ఏడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. 

ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పీవీ శ్రీనివాస్​ రావు, అయోధ్య రెడ్డి బోరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్​ రావు సీనియర్​ జర్నలిస్టు కాగా.. యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి  సీఎం సీపీఆర్వోగా ఉన్నారు.

ఇక గాంధీ భవన్​ పీఆర్వోగా ఉన్న  కప్పర హరిప్రసాద్​ది సిద్దిపేట జిల్లా కాగా.. పీఎల్ఎన్ ప్రసాద్​ పూర్వ నల్గొండ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నుంచి రాములు ఎస్సీ సామాజిక వర్గం కాగా.. కమిషనర్లలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసి​ని ప్రభుత్వం ఎంపిక చేసింది.  గత రెండేండ్లుగా సమాచార కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు 2025 జనవరిలో  ఆందోళన వ్యక్తం చేసి, నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితాను రాష్ట్ర సర్కారు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపింది.