చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ కదలికలపై మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రుని ఉపరితలంపై 8 రోజులుగా విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘‘ చంద్రుని ఉపరితలంపై ఎవరి ప్రమేయం లేకుండా ప్రయాణిస్తూ విజయవంతంగా పరిశోధనలు చేస్తున్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ పనితీరును నేను ముందుగానే ఊహించాను.. ఇది చంద్రుని ఉపరితలం ఆఫ్ రోడ్స్ యూటిలిటీ వెహికల్ తయారీదారుగా భారత్ అగ్రగామిగా నిలిచింది. ఈ ప్రతిభకు సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నాను’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Well, I guess this is the ultimate Off-road vehicle with autonomous driving capability. As India’s pioneering Off-Road Utility Vehicle makers, we have no option but to salute proudly! ????
— anand mahindra (@anandmahindra) August 31, 2023
pic.twitter.com/rpWgf40cy9