ఆస్ట్రేలియా బీచ్‌లో మెటల్ సిలిండర్ కలకలం.. చంద్రయాన్-3 శిథిలాలేనా?

పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో గుర్తు తెలియని మెటల్ సిలిండర్ కలకలం రేపింది.  దీనిపై ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధిస్తోంది.దీని మూలాన్ని గుర్తించేందుకు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రోతో సహా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపింది. అయితే ఇది ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 మిషన్ లోని ఓ భాగం కావచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ సోమవారం ట్విట్టర్‌లో పాక్షికంగా దెబ్బతిన్న వస్తువు ఫొటోను షేర్ చేసింది.  "మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఓ మెటల్ సిలిండర్ ను కొనుగొన్నాం. దీనిపై విచారణ జరుపుతున్నాం’’ అని తెలిపింది. ‘‘ఈ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనంగా మేం అనుమానిస్తున్నాం. మరింత సమాచారం అందించగల సహచర దేశాలతో సాయం కోరాం’’ అని  రాశారు. అయితే ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. 

ALSO READ :మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?:   ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

ABC న్యూస్ యొక్క నివేదిక ప్రకారం.. సుమారు 2.5 మీటర్ల వెడల్పు ,2.5 నుంచి3 మీటర్ల పొడవు కలిగిన వస్తువు, బార్నాకిల్స్ సముద్రం బీచ్ లో కనుగొనబడినబడింది. అయితే ఆ వస్తువు మార్చి 8, 2014న తప్పిపోయిన మలేషియా ఎయిర్‌లైన్స్ MH370 ఫ్లైట్‌లో భాగమేనా అని ఊహించారు. ఏవియేషన్ నిపుణుడు జాఫ్రీ థామస్ తోసిపుచ్చారు. 
కాగా.. చంద్రయాన్-3 మిషన్‌ ను ఎల్ వీఎం 3 రాకెట్ లో విజయవంతంగా ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక దాని రెండవ కక్ష్య- ఎగువకు చేరుకుంది. ప్రస్తుతం నిర్దిష్ట కక్ష్యలో ఉంది. ఈ మిషన్  చంద్ర కక్ష్యలోకి మారడం..ల్యాండర్‌ను వేరు చేయడం.. డీబూస్ట్ క్రమం ..చివరగా ఆగష్టు 23 సాయంత్రం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ కానుంది.