అద్భుతానికి దగ్గరగా : చంద్రుడికి వెయ్యి కిలో మీటర్ దూరంలో చంద్రయాన్ 3

అద్భుతానికి దగ్గరగా : చంద్రుడికి వెయ్యి కిలో మీటర్ దూరంలో చంద్రయాన్ 3

చంద్రయాన్ 3లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. చంద్రుడి ఉపరితలానికి.. అంటే చంద్రుడిపై దిగే ప్రదేశానికి కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరానికి చేరుకున్నది చంద్రయాన్ 3. ఈ విషయాన్ని ఆగస్ట్ 12వ తేదీ మధ్యాహ్నం ఇస్రో ప్రకటించింది. వెయ్యి కేవలం వెయ్యి కిలోమీటర్లు.. అంటే హైదరాబాద్ నుంచి కేరళ అంత దూరమే.. వాస్తవంగా అయితే చంద్రయాన్ 3 స్పీడ్ కు.. ఈ వెయ్యి కిలోమీటర్లను 10 నిమిషాల్లో పూర్తి చేసి.. ల్యాండర్ చంద్రుడిపైకి దిగేయొచ్చు.. అయితే సేఫ్ ల్యాండింగ్.. దిగే ప్రదేశంలోని వాతావరణ, ఇతర పరిస్థితులను అంచనా వేయటానికి.. ఉపరితలంపైనే మరో వారం రోజులు తిరగనుంది చంద్రయాన్ 3 శాటిలైట్. ప్రస్తుత పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయని.. అనుకున్నట్లుగానే ఆగస్ట్ 23వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్ 3 దిగుతుందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది ఇస్రో. 

ఇస్రో బుధవారం చంద్రయాన్-3ని చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా వెళ్లింది. - ఇప్పుడు అపోలూన్ (చంద్రునికి అత్యంత దూరంలో ఉన్న ప్రదేశం) వద్ద 1,437 కి.మీ. వద్ద ఉంది.  చంద్రుని కక్ష్యలో ప్రవేశించడం, చంద్రున్ని చేరే క్రమంలో మూడంచెలు పూర్తి చేసింది. ఈక్రమంలో చంద్రునికి మరింత దగ్గరయింది. ఇప్పుడు కేవలం 1,437 కి.మీ లదూరంలో ఉంది. 

ఆగష్టు 14న ఇస్రో అంతరిక్ష నౌక, చంద్రుని మధ్య దూరాన్ని మరింత తగ్గించనుంది ఇస్రో.  ఆగస్టు16న 100కిమీ వృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3  ప్రవేశించనుంది. అటు తర్వాత ఆగస్టు 17న ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోతాయి. విక్రమ్, ప్రజ్ఞాన్ లోపల కూర్చొని విడిపోయిన తర్వాత ఇస్రో దానిని పెరిలున్ (చంద్రునికి అత్యంత సమీప స్థానం) 30 కి.మీ , అపోలూన్ 100 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలోకి డీ-బూస్ట్ చేస్తుంది. ఈ కక్ష్య నుంచి ఇదే చివరి ల్యాండింగ్. 
బెంగళూరులో నిర్వహించిన NGO దిశాభారత్ కార్యక్రమంలో ఆగస్టు 23న సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చంద్రయాన్ 3లో ప్రవేశపెట్టిన వివిధ రిడెండెన్సీలను వెల్లడించారు. 

బెంగళూరులో నిర్వహించిన NGO దిశాభారత్ కార్యక్రమంలో ఆగస్టు 23న సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చంద్రయాన్ 3లో ప్రవేశపెట్టిన వివిధ రిడెండెన్సీలను వెల్లడించారు. ల్యాండింగ్ అత్యంత కీలకమైన భాగం.. ల్యాండర్ వేగాన్ని 30 కి.మీల ఎత్తు నుంచి చివరి ల్యాండింగ్ వరకు తగ్గించే ప్రక్రియ కీలకం. 30 కి.మీ వద్ద అంతరిక్ష నౌక అడ్డంగా ఉంటుంది. అంతరిక్ష నౌకను భూమికి సమాంతర దిశ నుంచి నిలువుగా మార్చడం పెద్ద సవాల్.చంద్రయాన్ 2 లో కూడా ఇక్కడే సమస్య తలెత్తింది. ఎక్కువ ఇంధనాన్ని వినియోంచకుండా, దూరం సరిగ్గా లెక్కించబడిందని నిర్ధారించుకోవాలి...దీనికోసం మేం మార్గదర్శకాలను రూపకల్పన చేశాం అని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు