భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ శాటిలైట్ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.. అయితే 2023 ఆగస్టు 26న చంద్రయాన్ 3 మిషన్ ల్యాండ్ కాగా.. మూడు రోజుల తర్వాత ఆ ప్రదేశానికి శివశక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దాదాపు 7 నెలల తర్వాత అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆ పేరును ఆమోదించింది.
IAU వర్కింగ్ గ్రూప్ చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్లేస్‌ను స్టాటియో శివశక్తిగా అధికారికంగా నామకరణం చేసింది.. ఈరోజు నుంచి విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్‌ను స్టాటియో శివక్తిగా పరిగణిస్తారు. గతంలో 2008 నవంబర్ 14న ప్రయోగించిన చంద్రయాన్ 1 ల్యాండింగ్ అయిన ప్రాంతాన్ని జవహర్ పాయింట్ అని, చంద్రయాన్ 2 ల్యాండర్ దిగిన ప్లేస్ కు తిరంగా అని పేరుపెట్టారు.