చంద్రయాన్-3 అంతరిక్ష నౌక మరో కీలక ముందడుగు వేసింది. భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి ఇప్పుడు చంద్రుని వైపు వెళుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆగస్టు 1 తెల్లవారుజామున తెలిపింది. “చంద్రయాన్-3 భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి చంద్రుని వైపు వెళుతుంది. ISTRACలో విజయవంతంగా పెరిజీ-ఫైరింగ్ నిర్వహించి, ఇస్రో అంతరిక్ష నౌకను ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది” అని ఇస్రో ట్వీట్ చేసింది.
బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్కింగ్ కేంద్రంలో పెరిజీ-ఫైరింగ్ దశ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఇప్పుడు చంద్రయాన్ - 3ని ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్కో.. నెక్స్ట్ స్టాప్ చంద్రుడే అని తెలిపింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఈ సందర్భంగా ఇస్రో వెల్లడించింది. అనుకున్నవన్నీ సజావుగా సాగితే.. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
The achieved orbit is
— ISRO (@isro) July 26, 2023
127603 km x 236 km.