చంద్రయాన్ 3 సక్సెస్ తో భారత్ చంద్రుడిపై తనదైన ముద్ర వేసింది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. బుధవారం (2023 ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విజయవంతంగా చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టింది. తాను విజయవంతంగా లక్ష్యాన్ని చేరినట్లు బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ (ISTRAC) కు సంకేతాలు పంపింది. క్రమంగా విక్రమ్ ల్యాండర్ తన పని మొదలు పెట్టింది. చంద్రుడిపై సంగ్రహించిన చిత్రాలను ఇస్రోకు చేరవేసింది. ఈ చిత్రాలను ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటిని క్రమంగా చంద్రుడిపైకి దిగుతున్న సమయంలో తీసిన ఫొటోలు.
విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ట్విట్టర్ లో ఉంచింది. ల్యాండర్ క్షితిజసమాంతర వెలాసిటీ కెమెరా నుంచి ఉద్భవించిన నాలుగు చిత్రాలు.. భూభాగానికి దగ్గర ఉన్న చంద్రుని దృశ్యాన్ని చూపెడుతుంది. విక్రమ్ ల్యాండర్ పంపించిన దృశ్యాల్లో చంద్రుని ఉపరితలం క్రేటర్లతో నిండి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఈ దృశ్యాలపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. చంద్రునిపై గుంతలు నివాసం మాత్రమే కాదు.. బాగా పనిచేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా సూచిస్తున్నాయి అని ఓ నెటిజన్ ట్వీట్ చమత్కరించారు. ఇది ఆమ్చి ముంబైలా కనిపిస్తోందని మరో నెటిజన్ స్పందించాడు. అక్కడ రైనీ సీజన్ అయి వుంటుందని ఇంకో నెటిజన్ రాశాడు.
భారత మాజీ క్రికెటర్ వసీ జాఫర్ కూడా హాస్యంగా కామెంట్ చేశాడు. నేను ఇక్కడ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను. స్పీన్నర్లు, సీమర్లను ఎదుర్కోవాలనుకుంటున్నాను అని ఫన్నీగా కామెంట్ చేశాడు.
ఇదంతా పక్కన బెడితే..చంద్రుడిపై ధృవ క్రేటర్స్ రాళ్ల మధ్య నీటి మంచు ఉంటే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది చంద్రుడిపై శాశ్వత మాన ఉనికి కలలకు ఆజ్యం పోస్తుందని అన్నారు. చంద్రునిపై ఉన్న ఈ గుంటలు అత్యాధునిక టెలిస్కోప్ లను నిర్మించడానికి మచ్చలుగా మారి వుండొచ్చని మరిన్న రహస్యాలను కనుగొనేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.