భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) చంద్రయాన్ 3 మిషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ ( సెప్టెంబర్ 22న) సాయంత్రం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను యాక్టివేట్ చేయాల్సి ఉండగా ఇస్రో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కొన్ని కారణాల వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల మేల్కొలుపు ప్రక్రియను రేపటికి (సెప్టెంబర్ 23)వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
#WATCH | Anand, Gujarat: On Chandrayaan-3, Director of Space Applications Centre, Nilesh Desai says, "...Earlier we planned to reactivate the (Pragyan) rover and (Vikram) lander on the evening of 22nd September, but due to some reasons we will now do it tomorrow on 23rd… pic.twitter.com/bvFTkXpNjZ
— ANI (@ANI) September 22, 2023
14 రోజుల తర్వాత చంద్ర రాత్రి తర్వాత.. తిరిగి ఇవాళ (సెప్టెంబర్ 22) చంద్రుని ఉపరితలంపై సూర్యోదయం కానున్న నేపథ్యంలో.. స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపే ప్రక్రియను ఇస్రో సాయంత్రం ప్రారంభించానుకుంది. సూర్యోదయం అయితే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు సూర్యరశ్మిని వినియోగించుకోవడం ద్వారా కమ్యూనికేషన్లను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని.. కావాల్సిన ఉష్ణోగ్రత కంటె ఎక్కువ వేడెక్కడానికి వేచి చూస్తోంది. ఇవాళ సాయంత్రం విక్రమ్, ప్రజ్ఞాన్‌లను మళ్లీ యాక్టివేట్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియను ఈ రోజు కాకుండా రేపు అనగా సెప్టెంబర్ 23న నిర్వహించాలనుకుంటున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
ISRO's plan was to attempt to reactivate Vikram and Pragyan today evening, but due to some reasons they will not do it today and will attempt tomorrow.
— ISRO Spaceflight (@ISROSpaceflight) September 22, 2023
- Nilesh Desai (SAC Director)#ISRO #Chandrayaan3 https://t.co/FtPW0nRqli