
చంద్రయాన్ 3 ల్యాండింగ్ సందర్భంగా.. దేశమంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చూశారు. అందుకే చంద్రయాన్ 3 వ్యూస్‌లోనూ వరల్డ్ రికార్డ్ సాధించింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లి మీద కాలు మోపినప్పుడు 8.1 మిలియన్ల మంది ఇస్రో నుంచి ప్రసారమైన లైవ్ చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన లైవ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇంతకు ముందు ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు 61 లక్షల మంది చూశారు. ఇదే ఇప్పటివరకు ఎక్కువమంది చూసిన లైవ్. అయితే.. ఇప్పుడు చంద్రయాన్ 3.. 81 లక్షల వ్యూస్‌తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది.