చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఇవాళ (ఆగస్టు17న) విజయవతంగా విడిపోయింది. ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్) వేరు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-3ని 153 కి.మీ x 163 కి.మీ కక్ష్యలోకి మార్గనిర్దేశం చేసేందుకు ఇస్రో బుధవారం తెల్లవారుజామున చంద్రుడిపైకి వెళ్లే చివరి విన్యాసాన్ని పూర్తి చేయగా.. ఇవాళ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విక్రమ్ (ల్యాండర్) ప్రజ్ఞాన్ (రోవర్)లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్‌ను వేరు చేసే ప్రక్రియ విజయవంతంగా పూర్తియింది.
ఆగష్టు 23న ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై దించే ప్రక్రియలో భాగంగా ఇస్రో గురువారం ల్యాండర్ విభజన ప్రక్రియను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది. దీని తర్వాత విక్రమ్ ల్యాండర్ ను మళ్లీ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచాలి. విక్రమ్‌ను పెరిలున్ (చంద్రునికి అత్యంత సమీప స్థానం) 30కిమీ, అపోలూన్ (చంద్రునికి అత్యంత దూరపు స్థానం) 100కిమీ ఉన్న కక్ష్యలో ఉంచే డి-బూస్ట్ విన్యాసాలు తర్వాత అంతిమంగా ల్యాండింగ్ జరుగుతుంది.
ల్యాండింగ్‌లో అత్యంత కీలకమైన 30కిమీ x 100కిమీ కక్ష్యను చేరుకున్న తర్వాత..ల్యాండర్ వేగాన్ని 30కిమీ ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు తగ్గించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 23న విక్రమ్ చివరి అవరోహణకు ముందు అంతరిక్ష నౌక క్షితిజ సమాంతర ధోరణిని నిలువుగా మార్చాల్సిన దశను విజయవంతం చే యాల్సి ఉందని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ తెలిపారు.
బుధవారం నాటికి చంద్రయాన్-3 33 రోజులు పూర్తి చేసుకుంది. జూలై 14న ప్రయోగించిన తర్వాత, చంద్రయాన్-3 జులై 15 ,25 మధ్య ఐదు భూ-ఉపరితల విన్యాసాలను పూర్తి చేసింది. ఇది భూమికి అత్యంత దూరంలో ఉన్న ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ (TLI) వద్ద దాని ఎత్తును 1.2-లక్ష-కిమీ కంటే ఎక్కువ ఎత్తుకు పెంచింది. ఆగష్టు 1న లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (LOI)కి ముందు దాదాపు 3.6-లక్షల -కి.మీ ఎత్తులో చంద్రుని వైపు ఒక మార్గంలో ఉంచబడింది. ఆగస్టు 5న చంద్రుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచారు ఇస్రో శాస్త్రవేత్తలు. బుధవారం దాని అపోల్యూన్ (చంద్రునికి అత్యంత దూరపు స్థానం)ను క్రమంగా తగ్గించారు.
Chandrayaan-3 Mission :
— Vijesh Kumawat (@Real_Vijesh) August 16, 2023
Separation of the Lander Module from the Propulsion Module is planned for tomorrow 17 August 2023.#ISRO #Chandrayaan3 #INDIA #isro #Space #Moonmission #lander #moon pic.twitter.com/4Fk8e7fPxG