చంద్రయాన్ 4 మూన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం

చంద్రయాన్ 4 మూన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్ 4 మూన్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల చంద్రయాన్ 3 సక్సెస్ తో ఉత్సాహంతో ఉన్న ఇస్రో.. చంద్రునిపైకి మానవ సహిత మిషన్ చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమయింది. ఈ క్రమంలో చంద్రయాన్ 4 మిషన్ కు కేంద్ర కేబినెట్ బుధవారం ( సెప్టెంబర్ 18, 2024) ఆమోదం తెలిపింది.  

చంద్రయాన్ 4  మూన్ మిషన్ లో భాగంగా చంద్రునిపై సక్సెస్ ఫుల్ గా ల్యాండింగ్, తర్వాత భూమికి పైకి తిరిగి రావడానికి టెక్నాలజీ డెవలప్ మెంట్ చేస్తున్నారు. చంద్రునిపై సక్సెస్ ఫుల్ ల్యాండింగ్, చంద్రునిపై నమూనాలను సేకరణ, వాటిని భూమిపై తీసుకురావడం మిషన్ లో భాగం. 

శాస్త్రీయ అన్వేషణ, చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం బాగా అర్థం చేసుకోవడానికి, మందపాటి వాతావరణంలో పరిశోధన చేస్తూ ఎక్కువ మొత్తంలో సైన్స్ డేటాను రూపొందించడమే చంద్రయాన్ 4 లక్ష్యం.  

Also Read :- టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది

ఈ ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ 4 కోసం రూ. 2,104.06 కోట్లు (సుమారు $253 మిలియన్లు) వెచ్చిస్తోంది భారత ప్రభుత్వం. భారత్ దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణ లక్ష్యాల దిశగా ఇస్రో చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమయింది. మరోవైపు వీనస్ ఆర్బిటర్ మిషన్ , భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (బిఎఎస్) ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.