మమ్మల్ని జైలుకు పంపి చంపే ప్లాన్!.. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చావు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? మా ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నరు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్‌తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది. అయినా సరే ఎలాంటి బెదిరింపులకు భయపడం. హైదరాబాద్‌లో మేం చాలా స్ట్రాంగ్​గా ఉన్నం. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నరు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది మేమే’ అని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తంచేశారు. అయితే ఇటీవలే జరిగిన ఓ బహిరంగ సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నాయని.. కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఒవైసీ బ్రదర్స్ చేసిన ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.