GrammyAwards: గ్రామీ విజేతల జాబితాలో ఏకైక భారత సంతతి సింగర్.. ఎవరామె..?

GrammyAwards: గ్రామీ విజేతల జాబితాలో ఏకైక భారత సంతతి సింగర్.. ఎవరామె..?

భారత సంతతికి చెందిన గాయనీమణికి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైన గ్రామీ అవార్డు(Grammy Award) లభించింది. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 67వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 2, 2025) అట్టహాసంగా జరిగింది. 

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ వేడుకలో పేరుపొందిన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ సందడి చేశారు. భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా కృష్ణమూర్తి టాండన్ (Chandrika Tandon) అవార్డు అందుకున్నారు.

ఆమె రూపొందించిన 'త్రివేణి' ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బ మ్ గా అవార్డు సొంతం చేసుకుంది. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చంద్రికకు ఇది రెండో గ్రామీ నామినేషన్ కావడం విశేషం.

ALSO READ | SankranthikiVasthunam: బాక్సాఫీస్కి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన విక్టరీ.. సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు

చంద్రిక చెన్నైలోని సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చంద్రికా కృష్ణమూర్తి టాండన్, ఆమె చెల్లెలు ఇంద్ర చిన్నప్పటి నుండి సంగీత శిక్షణ తీసుకున్నారు. చంద్రిక తన కుటుంబం నుండి సామవేద బోధనలు తీసుకుంది. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాల్లో వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు. పెప్పీకో మాజీ సీఈఓ ఇంద్రాసూయీకి చంద్రిక సోదరి అవుతారు. 

ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం ఎంతోమంది జీవితాల్లో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. కార్చిచ్చు కారణంగా జీవితాన్ని కోల్పోయిన బాధి తులకు అవార్డుల కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు.

విజేతలు వీరే 

రికార్డు ఆఫ్ ది ఇయ‌ర్ - నాట్ లైక్ అజ్ - కెండ్రిక్ లామర్

ఉత్తమ నూతన కళాకారుడు - చాపెల్ రోన్

ఉత్తమ రాప్ ఆల్బమ్ - అలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ - డోచీ

ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ - షార్ట్ ఎన్’ స్వీట్ - సబ్రినా కార్పెంటర్

లిరిక్ రైట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ - నాన్-క్లాసికల్ - అమీ అలెన్

ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన - ఎస్ప్రెస్సో – సబ్రినా కార్పెంటర్

ఉత్తమ పాప్ డ్యూయో/గ్రూప్ ప్రదర్శన - డై విత్ ఎ స్మైల్ - లేడీ గాగా & బ్రూనో మార్స్

ఉత్తమ డ్యాన్స్ పాప్ రికార్డింగ్ - వాన్ డచ్ - చార్లీ XCX

ఉత్తమ రాక్ ప్రదర్శన - నౌ & దెన్ - ది బీటిల్స్

ఉత్తమ రాక్ ఆల్బమ్ - హాక్నీ డైమండ్స్ - ది రోలింగ్ స్టోన్స్

ఉత్తమ కంట్రీ ఆల్బమ్ - కౌబాయ్ కార్టర్ - బియోన్స్

ఉత్తమ లాటిన్ పాప్ ఆల్బమ్ - లాస్ ముజెరెస్ యా నో లోరాన్ - షకీరా

ఉత్తమ మ్యూజిక్ వీడియో - నాట్ లైక్ అజ్ - కెండ్రిక్ లామర్