వరంగల్ లో కెమికల్ బాక్స్ బ్లాస్ట్

వరంగల్ లో భారీ పేలుడు సంభవించింది. పట్టణంలోని హంటర్ రోడ్డు ఏన్టీఆర్ నగర్ లో ఒక్కసారిగా కెమికల్ బాక్స్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో భూక్య చంద్రు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రు కాలు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో బోందివాగులో కెమికల్ బాక్స్ కొట్టుకు వచ్చింది. రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే చంద్రుకు ఈ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ లో ఏముందని మూత తీయటంతో ఒక్కసారిగా కెమికల్ బాక్స్ పేలింది. దీంతో చంద్రుకి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన చంద్రుని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చంద్రు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేపట్టారు.