9 ఏండ్లుగా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడి..చందుర్తి మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ మృతి

9 ఏండ్లుగా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడి..చందుర్తి మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ మృతి

చందుర్తి: వెలుగు: పది మందికి వైద్యం చేయాలన్న కల అతడిని డాక్టర్ చేసింది. కానీ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృత్యువు రూపంలో అతడి కలల్ని చిదిమేసింది. తాను చనిపోతానని తెలిసీ కష్టపడి డాక్టర్ అయినా.. అతని జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి వేదాచారి(32) తల్లిదండ్రులకు ముగ్గురు సంతానంలో చిన్నవాడు.

ఇంటర్ చదువుతుండగా 2016లో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటపడింది. ఆత్మస్థైర్యంతో మృత్యువుతో పోరాడుతూనే 2022లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశారు. అప్పటినుంచి ఆరుసార్లు కీమోథెరపీ చేయించుకున్నా క్యాన్సర్ తగ్గలేదు. ఆతర్వాత కాలును కోల్పోయిన ఆయన కృత్రిమ కాలుతోనే జీవిస్తున్నాడు. ఎలాగైనా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి పేదలకు వైద్యం చేయాలన్న కోరికతో ప్రభుత్వ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగం సాధించారు.

చందుర్తి పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేదాచారి 2024లో బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి పేదలకు వైద్యం చేస్తున్న ఆయన ఈనెల 11న స్పృహ కోల్పోయాడు. వెంటనే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయారు.