ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో చాగంటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. అనంతరం మీడియాతో మాట్లాడిన చాంగటి... వేములవాడ రాజన్న ఆలయం కొడే మొక్కులకు ఎంతో ప్రసిద్ధి చెందిదన్నారు. దక్షిణ కాశీగా పిలవబడే రాజన్నను దర్శించుకోవడం ఎంతో పుణ్యమని చెప్పారు.
ఇక్కడి ఆలయంలో రామచంద్రమూర్తి, అనంత పద్మనాభస్వామి, రాజరాజేశ్వర స్వామి, రాజేశ్వరీ దేవి అమ్మవార్లు ఉండడం విశేషమని చెప్పారు. ఈ ఆలయాన్ని సందర్శించడం తాను అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా వరుస రెండురోజులు సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.