2020లో విజయవంతంగా చేపట్టిన చాంగే–5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్న బీజింగ్ నేషనల్ లేబొరేటరీ ఫర్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు వాటిలో నీటి అణువులను గుర్తించారు. జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది.
చాంగే–5 ద్వారా 2020లో చైనీయులు మట్టి, రాళ్లతో కూడి నమూనాలను తీసుకొచ్చారు. వీటిని సీఏఎస్తోపాటు మరో రెండు పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
అమెరికా, రష్యా వ్యోమగాములు కూడా 40 ఏళ్ల క్రితమే చంద్రుడి నుంచి నమూనాలను సేకరించి తీసుకువచ్చారు.
2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు కలసిఇ ఉన్న ఖనిజాలను గుర్తించింది. 2020లో నాసా కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది.