ట్రెండింగ్: ముసలి ముఖాన్ని చూపించే ఫేస్ యాప్

ట్రెండింగ్: ముసలి ముఖాన్ని చూపించే ఫేస్ యాప్

ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు వృద్ధా ప్యంలో ఎలా ఉంటారో తెలిపే ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇదో ట్రెండుగా మారింది. ఈ ఫొటోలను అందిస్తోంది ‘ఫేస్ యాప్’. రెండేళ్లక్రితం అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ఫిల్టర్ యాప్ యూజర్ల ఫొటోల్ని డిఫరెంట్ లుక్స్ లో అందిస్తుంది. ఒకప్పుడు ఈ యాప్ లో ఫిల్టర్ చేసిన ఫొటోలు ట్రెండుగా మారితే, తాజాగా ఈ యాప్ లోని ‘ఓల్డ్ ఫిల్టర్’ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆర్టిఫి షియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వాడుకుని యూజర్ల ఫొటోలను ఈ యాప్ వృద్ధాప్యంలో ఎలా కనిపిస్తారో అలా మార్చేస్తుంది. సెల్ఫీలు, ఇతర ఫొటోల్ని యూజర్లు ‘ఓల్డ్ ఫిల్టర్’ను ఉపయోగించి ఓల్టేజ్ ఫొటోలుగా చేసుకుంటున్నారు.

అమెరికాకు సంబంధించి కొందరు హాలీ వుడ్ నటులు కూడా ఈ యాప్ లోని ఫిల్టర్ ను వాడుతుండటంతో ఇప్పుడిదో ట్రెండుగా మారింది. బాలీవుడ్ తారలు కూడా ఈ యాప్ లో ఫిల్టర్ చేసిన ఓల్డ్ ఏజ్ ఫొటోల్ని షేర్ చేస్తున్నారు. చాలా మంది ఈ ఫొటోలకోసమే యాప్ ను ఇన్ స్టాల్  చేసుకుంటున్నారు. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఫొటోలను ‘ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్’లలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ వృద్ధాప్యంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటే ఈ యాప్ వాడొచ్చు. అయితే ఇది ఫ్రీ యాప్ మాత్రం కాదు. మన కరెన్సీ లో సంవత్సరానికి పదిహేడు వందల రూపాయలు చెల్లించాల్సిందే. అయితే మొదటి మూడు రోజులు ఉచితంగా ట్రయల్ చేయొచ్చు.