జగిత్యాల టౌన్/రాయికల్ వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని, వారి అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి తనకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. అనంతరం సీఎం కేసీఆర్26న జగిత్యాలకు రానున్న దృష్ట్యా సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజశంగౌడ్ పరిశీలించారు.