- ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
జల్గావ్: మహారాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. మార్పుతోనే రైతులు, మహిళలు, యువత జీవితాలు ఇంప్రూవ్ అవుతాయన్నారు.
సోమవారం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా పరోలాలో ఎంవీఏకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శరద్ పవార్ మాట్లాడారు. రాష్ట్రంలో మహాయుతి కూటమి పాలనలో నిరుద్యోగ సమస్య తోపాటు రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. ఎంవీఏ కూటమికే ఓటు వేయాలని ప్రజలను పవార్ అభ్యర్థించారు.