టెన్త్ ఎగ్జామ్లో నిర్లక్ష్యం.. ఒక పేపర్కు బదులు మరో పేపర్

టెన్త్ ఎగ్జామ్లో  నిర్లక్ష్యం.. ఒక పేపర్కు బదులు మరో పేపర్

 తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు  ప్రశాంతంగా జరుగుతున్నాయి.  అయితే మంచిర్యాల జిల్లా పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది.  మంచిర్యాల పట్టణం బాయ్స్ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్ కు టెన్త్ ఎగ్జామ్  ఫస్ట్ పేపర్ కు బదులు సెకండ్ పేపర్ పంపించారు  విద్యాశాఖ అధికారులు. ఇది గమనించకుండా పరీక్ష నిర్వహించారు సెంటర్ నిర్వాహకులు.  సుమారు గంట తర్వాత ఎగ్జామ్ పేపర్ మారిన విషయం గుర్తించి మళ్లీ 240 మంది విద్యార్థులకు  ఫస్ట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయించారు.   

పరీక్షా సమయం పూర్తయినా కూడ విద్యార్థులు బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఎగ్జామ్ సెంటర్ను  సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ | తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒకట్రెండు బైకులు.. ఐదు కుటుంబాలకు ఓ కారు

ఏప్రిల్ 4 వరకు జరగనున్న టెన్త్ ఎగ్జామ్స్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 5 లక్షల 9 వేల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారని..వీళ్లకు 2650 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.