మదర్ డెయిరీ గాడిన పడేనా ?

నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీ) పాలకవర్గంలో మార్పులు జరగడంతో సంఘానికి ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న డెయిరీ గట్టెక్కాలంటే ప్రభుత్వ అండ తప్పనిసరిగా మారింది. సుమారు రూ.వెయ్యి కోట్ల స్థిరాస్తులు కలిగిన డెయిరీ పాలకవర్గ నిర్ణయాలతో నష్టాల బాట పట్టింది. డైరెక్టర్లు, ఆఫీసర్లు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అందినకాడికి సొమ్ము చేసుకోవడంతో డెయిరీ నష్టాలు రూ.20 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవల జరిగిన ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1.20 కోట్ల లాభాల్లో ఉన్నట్టు చూపించినా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఆలేరు నుంచే ఎక్కువ పాలు

మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీకి అవసరమయ్యే పాల సేకరణ అత్యధికంగా ఆలేరు నియోజకవర్గం నుంచే జరుగుతోంది. మొత్తం 278 సంఘాలు ఉంటే 150కి పైగా సంఘాలు ఆలేరులోనే ఉన్నాయి. పాలకవర్గంలోని 15 మంది డైరెక్టర్లలో ఐదుగురు ఆలేరు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు డెయిరీ భవితవ్యం అంతా ఆలేరు లీడర్లపైనే ఆధారపడింది. డెయిరీలో రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 37 వేల లీటర్లకు పడిపోయింది. పశువుల దాణా కంపెనీ మూసేసి ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ నుంచి దాణా కొంటున్నారు. ముఖ్యంగా డైరెక్టర్లు, చిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల మేనేజర్లు కమ్మక్కై పాడి రైతులకు నష్టం కలిగిస్తున్నారు. డెయిరీలో జరుగుతున్న అక్రమాలపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. ఒక్క జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భోజనాల ఖర్చు పేరిట రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రైతులకు చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాల సేకరణ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సప్లై చేయాల్సిన నెయ్యి కూడా పంపడం లేదు. ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 7 కోట్ల అక్రమాలు జరిగాయని డైరెక్టర్లలోని ఓ వర్గం ఆరోపిస్తుండగా, తాజా మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి మాత్రం ప్రతి పైసా ఖర్చు రికార్డుల్లో ఉందని గత మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పారు. ఎన్నికలు జరగడానికి ముందు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్ల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు సమాచారం. డెయిరీ ఒక్క ఏడాదిలోనే నష్టాల పాలు కాలేదని, గతంలోనే రూ.40 కోట్ల నష్టాలు ఉంటే, వాటిని రూ. 20 కోట్లకు తగ్గించామంటూ గొడవ పడ్డారు. ఈ వివాదాల నేపథ్యంలో ఏడాదిలోనే గంగుల కృష్ణారెడ్డి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అనవసర ఖర్చులు తగ్గిస్తేనే...

పాడి రైతులు కొత్త పాలకవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. డెయిరీకి పూర్వవైభం తేవాలంటే పాల సేకరణ పెంచాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీల వైపు మొగ్గు చూపిన రైతులను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం బకాయిపడ్డ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇప్పించడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి రైతులకు బిల్లులు చెల్లించాలి. మూతపడ్డ దాణా సంస్థను తిరిగి తెరిపిస్తే నాణ్యమైన దాణా దొరుకుంది. చిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయడం, పాలు కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవడం, సకాలంలో పాలకవర్గ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టడం, అనవసర ఖర్చులు తగ్గిస్తే తప్ప మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీ గాడిన పడదని ఓ ఆఫీసర్‌‌‌‌ చెప్పారు.