Vijay Thalapathy: విజయ్ దళపతి పార్టీ పేరులో మార్పు.. కారణం ఏంటంటే?

Vijay Thalapathy: విజయ్ దళపతి పార్టీ పేరులో మార్పు.. కారణం ఏంటంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay Thalapathi) ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. విజయ్ తలపతి ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం పార్టీ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ పేరులో అదనంగా 'క్‌' అనే అక్షరాన్ని యాడ్ చేస్తున్నారట. కారణం ఏంటంటే.. తమిళగ వెట్రి కళగం పార్టీని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడులోని కొన్ని పార్టీల నుండి వ్యతిరేకత వస్తోంది. 

తమిళనాట తమిళగ వాల్వురిమై కట్చి అనే పేరుతో ఇప్పటికే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇక విజయ్‌ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటంతో తమకు ఇబ్బంది కలుగుతుందని వారు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో 'క్‌' అనే అక్షరాన్ని జోడించాలని నిర్ణయించుటకున్నారట. దీంతో ఇక నుండి తమిళగ వెట్రిక్‌ కళగం అని పిలవాలని నిర్ణయించాయి పార్టీ వర్గాలు.