రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్లో మార్పులు

  • 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో స్వల్ప  మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం 13 రోజుల పాటు జరగాల్సిన యాత్రను మరో రెండు రోజులు పెంచారు. మొత్తం  15 రోజులపాటు రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. 

రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్ర అక్టోబర్ 24వ తేదీన రాష్ట్రంలో ప్రవేశించనుంది. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా పాదయాత్ర ఎంటర్ అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్ నుంచి మొదలై  దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరం పేట, మద్నూర్ ల గుండా రాహుల్ యాత్ర సాగనుంది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొత్తం 15 రోజుల పాటు 350 కిలోమీటర్లు జరుగుతుంది. 

రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్  

  • 13 రోజుల నుండి 15 రోజులకు పెరిగిన యాత్ర
  • అక్టోబర్ 24న తెలంగాణ లోకి ప్రవేశించనున్న పాదయాత్ర
  • మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ప్రవేశం
  • 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర