12 ఫ్లోర్లలో హాస్పిటల్‌‌‌‌..మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌లో మార్పులు !

  •     ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేస్తున్న ఆఫీసర్లు
  •     పర్మిషన్లు, ఫండ్స్‌‌‌‌ కోసం నేటి సీఎం టూర్‌‌‌‌లో విన్నవించనున్న ప్రజాప్రతినిధులు

వరంగల్‍, వెలుగు : వరంగల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌తో పాటు 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ పనుల్లోనూ మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 18 ఫ్లోర్‌‌‌‌లు పూర్తి అయ్యాయి. అయితే 12 ఫ్లోర్లలో త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసి వైద్యసేవలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక వరంగల్‌‌‌‌ను ఫ్యూచర్‌‌‌‌ సిటీగా తీర్చిదిద్దడం కోసం మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ రూపొందించాలన్న ఆలోచనతో ఉన్న ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఇందుకు కావాల్సిన పర్మిషన్లు, ఫండ్స్‌‌‌‌ కోసం సీఎంకు విన్నవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండో రాజధాని కోసం కొత్త మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌

గ్రేటర్‌‌‌‌ వరంగల్‍ సిటీలో ఇప్పటికీ 1971 నాటి మాస్టర్‌‌‌‌ ప్లానే అమలవుతోంది. 1991లో కొత్త మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ తీసుకురావాల్సి ఉండగా.. 53 ఏండ్లుగా పట్టించుకోలేదు. గ్రేటర్‌‌‌‌ వరంగల్‍ చుట్టూ 40 ఏండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కుడా పరిధిలో 2013లో కొత్త ప్లాన్‌‌‌‌ రూపొందించారు. కానీ 2014లో బీఆర్ఎస్‌‌‌‌ ప్రభుత్వంఅధికారంలోకి రాగానే జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు, లీడర్లు ప్లాన్‌‌‌‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్రేటర్‍ చుట్టూ 20 కిలోమీటర్ల వరకు భూములకు డిమాండ్‍ రావడంతో బినామీల పేరుతో ఎకరాల కొద్దీ కొనుగోలు చేశారు. వాటికి దగ్గరగా రింగురోడ్డు వచ్చేలా ప్లాన్‌‌‌‌ మార్చారు.

హైదరాబాద్‌‌‌‌ మార్గంలో మడికొండ, రాంపూర్‍ ఏరియాల్లో భూములు కొని వాటికి దగ్గర్లో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ కంపెనీలు పెట్టించారు. 2020 మార్చి 11న మంత్రి కేటీఆర్ ప్లాన్‌‌‌‌కు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చారు. తర్వాత ఫైల్‌‌‌‌ను సీఎంవోకు పంపించగా అప్పటి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లాన్‌‌‌‌ను గమనించి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల ఆస్తులకు డిమాండ్‌‌‌‌ పెరిగేలా ఉందని గుర్తించారు.

దీంతో ఈ ప్లాన్‌‌‌‌ను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త ప్లాన్‌‌‌‌ రూపొందించేలా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కోరుతామని జిల్లా మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు చెప్పారు. అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ, అండర్‌‌‌‌ వాటర్‌‌‌‌ పైప్‌‌‌‌లు, అండర్‌‌‌‌ కేబుల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ రావడంతో పాటు మేజర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్లాన్‌‌‌‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

హాస్పిటల్​చుట్టూ అన్నీ వివాదాలే...

వరంగల్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ను కూల్చి ఆ స్థలంలో నిర్మిస్తున్న సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌పై మొదటి నుంచీ వివాదాలు ముసురుకుంటున్నాయి. అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌ ఆగమేఘాల మీద ఐదు రోజుల్లోనే సెంట్రల్‌‌‌‌ జైలును కూల్చి వేయించి 2021 జూన్‌‌‌‌ 21న హాస్పిటల్‌‌‌‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొదట్లో 33 అంతస్తులు అన్నారు... ఆపై 24 ఫ్లోర్లకు పరిమితం చేశారు. హాస్పిటల్‌‌‌‌ పూర్తి కావడానికి రూ.1,116 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి పైసాను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తీరా చూస్తే.. సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ భూములను గుట్టుచప్పుడు కాకుండా బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మహారాష్ట్రలో కుదువపెట్టి రూ.1,150 కోట్ల అప్పు తీసుకొచ్చారు.

తర్వాత పనులు, ఖర్చు వివరాలను రిలీజ్‌‌‌‌ చేసిన ప్రభుత్వం వరంగల్‌‌‌‌లో నిర్మిస్తున్న హాస్పిటల్‌‌‌‌ వ్యయాన్ని రూ.1,116 కోట్లు కాకుండా ఏకంగా రూ.3,779 కోట్లుగా చూపారు. వరంగల్‌‌‌‌ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణంపై కేసీఆర్‍ తీసుకున్న నిర్ణయం, పెడుతున్న ఖర్చు, పేషెంట్లకు అందే సేవలపై కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రిపోర్ట్‌‌‌‌ తెప్పించుకుంది. హాస్పిటల్‌‌‌‌ నిర్మాణం ప్రస్తుతం 18 ఫ్లోర్లు పూర్తి కావడంతో మరింత ఆలస్యం జరగకుండా 12 అంతస్తుల్లో హాస్పిటల్‌‌‌‌ను ప్రారంభించి సేవలు అందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, ఆఫీసర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించిన అనుమతులతో పాటు, పరికరాలు, సిబ్బంది రిక్రూట్‌‌‌‌మెంట్ల కోసం సీఎం టూర్‌‌‌‌లో ఫండ్స్‌‌‌‌ అడిగేందుకు సిద్ధం అవుతున్నారు.