భూ సేకరణ చట్టంలో మార్పులు చేయాలి

భూ సేకరణ చట్టంలో మార్పులు చేయాలి
  • సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ​ఇండియా

ముషీరాబాద్, వెలుగు: భూ సేకరణ చట్టం – 2013లో మార్పులు చేసి, అమలు చేయాలని సోషలిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. సుభద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. రైతు సమస్యలపై ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్​వద్ద ఆందోళన చేపట్టారు. రైతులు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనాలన్నారు. భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్పులు చేసి, పేద రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బీమా పరిమితిని 58 నుంచి 65 ఏండ్లకు పెంచడంతోపాటు రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలన్నారు.