తిరుపతి రూరల్లో పట్ట పగలే దొంగలు బరి తెగించారు. అవిలాల పరిధిలోని వాణి నగర్ లో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఆ మహిళ ఇంటి పనులు చేసుకుంటుంటగా కంట్లో కారం కొట్టి మెడలోని గొలుసును అపహరించారు. స్థానికంగా నివసిస్తున్న నాగ స్వాతి అనే మహిళ మెడలోని గొలుసును అపహరించారు.
Also Read :- హైదరాబాద్ లో టీస్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు
ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఓ మహిళతోపాటు మరో వ్యక్తి ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. సీసీ ఫుటేజిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న తిరుపతి రూరల్ ఎస్సై రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.