చంటి, లహరి జంటగా కె.వి.ఆర్ దర్శకత్వంలో ఎం.నారాయణ స్వామి నిర్మిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. నెంబర్ మిస్సింగ్ ట్యాగ్‌లైన్‌తో రూపొందిస్తున్నారు. సలీమ్ మాలిక్ అడిషనల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఆదివారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేయగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో త్రినాథరావు మాట్లాడుతూ ‘చిన్న, పెద్ద సినిమాలనేం లేదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు.
రీసెంట్‌గా రిలీజైన ‘బేబీ’ చిత్రమే దానికి ఉదాహరణ. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ చిత్రంతో టీమ్ అందరికీ మంచి విజయం రావాలని కోరారు బెక్కెం వేణుగోపాల్.
సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు చంటి, లహరి. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తామన్నారు దర్శక నిర్మాతలు. జయసుధ, షియాజీ షిండే, బాబు మోహన్, పృథ్వీరాజ్, పాకీజా లాంటి సీనియర్స్ ఇందులో నటించారు.