
జోగిపేట, వెలుగు : ఆందోల్ అభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అల్మాయిపేట సర్పంచ్ బాలమణి రవిశంకర్‌తో పాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు, బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ నాయకత్వం కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌టీపీసీ చైర్మెన్ భిక్షపతి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మెన్ జైపాల్‌రెడ్డి, జోగిపేట ఏఎంసీ చైర్మెన్ పల్లె సంజీవయ్య, లక్ష్మీ కాంతారెడ్డి, బాలయ్య, మహేశ్వర్‌రెడ్డి, లింగన్న, విజయ్, జహంగీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.