
ఢిల్లీలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దుమ్ము తుఫాన్ ఎఫెక్ట్ తో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 12 ఉదయం వరకు ఇందిరాగాంధీ ఎయర్ పోర్టు నుంచి 205 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 50 విమానాలను దారిమళ్లించారు. ఏడు విమానాలను రద్దు చేశారు.
ఫ్టైట్స్ ఆలస్యం వల్ల చాలా మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులుగాస్తున్నారు. రద్దీతో ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోయింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు బస్టాండ్ కంటే దారుణంగా ఉందని ఓ ప్రయాణికుడు తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుమ్ము తుఫాను తర్వాత విమానాలను దారి మళ్లించి రద్దు చేశారు. దీనివల్ల ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫ్టైట్ కోసం వేచి ఉన్న ప్రయాణీకులకు ఇబ్బంది కలిగింది. దారి మళ్లించిన విమానం ఢిల్లీ చేరుకోవడానికి సమయం పట్టింది, దీని వల్ల విమానాశ్రయంలో రద్దీ ఏర్పడింది అని ఒక అధికారి తెలిపారు.
విమానాల జాప్యాలు మరియు రద్దులపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి, విమానయాన సంస్థల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే తమ ప్రయాణానికి ఇబ్బంది తలెత్తిందని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా ఊహించని సమస్య వల్ల మీ ప్రయాణానికి ఇబ్బంది తలెత్తినందుకు చింతిస్తున్నాం..మా సిబ్బంది మీకు ఇబ్బంది కల్గకుండా చూస్తారని.. దయచేసి సహకరించాలంటూ విజ్ఞప్తి చేసింది.
IC827 https://t.co/pI53ILp3IW
— Ärvind Lal (@lalarvi) April 12, 2025