వెలుగు, నెట్వర్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు పలుచోట్ల ప్రశాంత వాతావరణంలో జరుగగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మరికొన్ని చోట్ల అధికారులు చదివి వినిపించిన సర్వే వివరాలపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. పలుచోట్ల గొడవల వాతావరణం నెలకొంటుండగా, పోలీసులు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. -