
చట్టాలు చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా మారితే ఎలా ఉంటుంది. అది కూడా అసెంబ్లీ సాక్షిగా.. రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారన్న విచక్షణ లేకుండా. ఒడిశా అసెంబ్లీలో అదే జరిగింది. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న ఆలోచన మరిచి గల్లా పట్టుకుని కొట్టుకుని కొట్టుకున్నారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త పిడి గుద్దుల వరకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇవాళ (మంగళవారం, మార్చి 11) ఒడిశా అసెంబ్లీలో కొశ్చన్ హవర్ లో ఎమ్మెల్యేల మధ్య ఫైట్ చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలర్ పట్టుకోవడం తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేసీ మొహపాత్ర కు ఎదురుగా నిల్చున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడికి దిగాడు బీజేపీ అభ్యర్థి.
ALSO READ | జనాభా లెక్కలు వెంటనే మొదలుపెట్టండి : పార్లమెంటరీ ప్యానెల్
‘‘సభ ఆర్డర్ లో లేనపుడు సమాధానం ఇవ్వడం తగదని నేను మంత్రిని వేడుకుంటున్నాను. చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో సడెన్ గా ఎమ్మెల్యే నా కాలర్ పట్టుకుని తోసేశాడు.’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపాటి తెలిపారు.
మరోవైపు ట్రెజరీ బెంచ్ కు సంబంధించిన సభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఒకరినొకరు ఘోరంగా తోసేకున్నారు. బీజేపీ కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒకరిపైకి ఒకరు దాడులు దిగి సబ రచరచ్చగా మారడంతో వాయిదా వేశారు స్పీకర్. అయితే సభలో బీజేడీ సభ్యులు ఉన్నప్పటికీ గొడవలో ఇన్వాల్వ్ కాలేదు. దూరంగా ఉండి నిరసనలు తెలిపారు.
గొడవకు కారణం:
1933లో కోసలా ప్రాంతాన్ని ఒడిశాలో కలపడాన్ని చారిత్రక తప్పిదం అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా. దీనిపై సీఎం మోహన్ చరణ్ మాఝీ స్పందనేంటో చెప్పాలని బీజేడీ సభ్యులు సభ ప్రారంభం నుంచే ఆందోళనకు దిగారు. అదే సమయంలో రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, క్రైమ్ పై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు కూడా సభలో అదే గందరగోళం ఏర్పడింది.
అయితే సమావేశాల్లో భాగంగా స్పీకర్ 30 నిమిషాల కొశ్చన్ హవర్ కు అనుమతించారు. అయితే గత రెండు రోజులుగా సీఎం సభకు రాకపోవడంపై బీజేడీ సభ్యులు అసెంబ్లీ ఆవరణలో సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కూర్చొని నిరసనలు తెలిపారు.