చర్లలో క్షుద్ర పూజల కలకలం

చర్లలో క్షుద్ర పూజల కలకలం

భద్రాచలం, వెలుగు: చర్ల మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. స్థానిక సాయినగర్​ కాలనీలోని ఓ ఇంటి ముందు శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి పసుపు, కుంకుమ కలిపిన బియ్యంతో పాటు బొగ్గులు, వెంట్రుకలు, నిమ్మకాయలు కనిపించడంతో బాధితులు భయాందోళనలకు గురయ్యారు. అంతకుముందు రోజు కూడా ఇదే కాలనీలో ఇలా పూజలు చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్​ చేశారు.