ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రోడ్డు పరిస్థితి ఇది. రోడ్డుపై రాకపోకలు సాగించే స్థానికులతోపాటు, వాహనదారులు నరకం చూస్తున్నారు. రూ.15 కోట్ల నిధులతో పట్టణంలో 2 కిలో మీటర్ల మేర రోడ్డు వెడల్పు పనులకు గతేడాది శ్రీకారం చుట్టగా.. పనులు అస్తవ్యస్తంగా సాగుతుండటం జనాలకు శాపంగా మారింది.
రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
వెలుగు, ఖానాపూర్