ప్రస్తుతం జనాలు చాలామంది డైట్ కంట్రోల్ కోసం చపాతీలను తింటుంటారు. అయితే చపాతీలు తినేవారికి బాగానే ఉంటుంది కాని,,, చేసేవారికి ఇబ్బందులు.. పెనంపై అటూ.. ఇటూ తిప్పుతూ కాలుస్తూ ఉండాలి. అసలే ఎండాకాలం.. వేడి మంట పుట్టిస్తుంది. అయితే ఓ మహిళ చపాతీలను కాల్చడానికి ఓ కొత్త టెక్నిక్ వాడింది. పొయ్యి వద్ద ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త పద్ధతిని ఫాలో అయింది. అసలు అలసటే లేకుండా చపాతీలు తయారుచేసే న్యూ టెక్నిక్ ను కనిపెట్టింది. ప్రస్తుతం ఈ మహిళ చేసిన కొత్త టెక్నిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చపాతీలు అంటే చాలా మందికి గుర్తొచ్చేది డైటింగ్. డైటింగ్ ప్రియులకు చపాతీలు అంటే ఇష్టంగా తింటుంటారు. వీరే కాదు ఉత్తర భారతదేశంలో చాలా మంది చపాతీలనే తమ ఆహారంగా తీసుకుంటుంటారు. అందుకే అక్కడి వెళితే భోజనం కోసం చూసే వారికి చాలా వరకు చపాతీలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం ఎవరు చూసినా డైటింగ్‌ల పేరుతో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. డైటింగ్ లో భాగంగా చపాతీలు, పుల్కాలు తీసుకుంటుంటారు. అయితే చపాతీలను తయారు చేసే విధానం అయితే సాధారణంగా అందరికీ తెలిసిందే.ఒక్కొక్క రొట్టెను పిండితో తయారుచేసి దానిని పెనంపై కాల్చుతుంటారు. ఈ ప్రాసెస్‌ని చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. పిండిని కలిపి, దానిని తయారుచేసి రొట్టె పెనంపై కాల్చడం హుష్…. ఎంత పెద్ద తంటాలు రా అని తలపట్టుకుంటుంటారు.
కాని ఓ మహిళ కొత్త టెక్నిక్‌తో చపాతీలను తయారు చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే చపాతీలు రడీ అయ్యాయి. దీని కోసం ఆమె ప్రెషర్ కుక్కర్ ను యూజ్ చేసింది. ముందుగా రొట్టెను తయారుచేయడానికి పిండిని కలిపి పెట్టింది. అనంతరం కలిపిన పిండితో ఐదు నుంచి ఆరు రొట్టెలను తయారుచేసింది. అవి పూరీల కంటే కాస్త పెద్ద సైజ్‌లో తయారుచేసింది. ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముందుగా దానిని స్టవ్ పై పెట్టింది. అనంతరం కుక్కర్ లో చిన్న గిన్నెలో ఉప్పు తీసుకుని అందులో వేసింది. ఆ తర్వాత ఆ ఉప్పుపై మరో గిన్నెను పెట్టింది. ఇక ఆ గిన్నెపై మొదటి రోటిని పెట్టింది. అలా 5,6 రోటీలను పేర్చింది. అనంతరం కుక్కర్ లాక్ చేసింది. కొన్ని నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూసింది. ఇక అవి ఆవిరికి తయారయ్యాయి. అనంతరం ఆ చపాతీలను తీసుకుని కొద్దిగా నెయ్యి వేసింది. వీటినే నెటిజన్లకు వీడియోలో చూపింది. ప్రస్తుతం మహిళ చేసిన చపాతీలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
वो स्त्री है कुछ भी कर सकती है😜 😂🤣 pic.twitter.com/2T7MxliF4r
— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) April 5, 2024