Summer Tour : 30 నుంచి ఛార్ దామ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..!

Summer Tour : 30 నుంచి ఛార్ దామ్ యాత్ర ప్రారంభం..  రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్​ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్​ 30 నుంచి, కేదార్‌నాథ్‌ను మే 2 నుంచి, బద్రీనాథ్‌ను మే 4 వ తేదీ వరకు  భక్తుల కోసం తెరుస్తారు.భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయించుకోవచ్చు. డెహ్రాడూన్‌, హరిద్వార్‌, గుప్త కాశి, సోన్‌ప్రయాగ్‌ తదితర నగరాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా భక్తులు నమోదు చేయించుకోవచ్చు.

యాత్ర తేదీల వివరాలు

  • ఏప్రిల్ 30: యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి
  • మే 2: కేదారనాథ్ ఆలయం ప్రారంభం
  • మే 4: బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం 

ఆలయాన్ని మూసేసే తేదీలు

  • అక్టోబర్ 22: యమునోత్రి ఆలయం మూసివేయనుంది
  • అక్టోబర్ 23: గంగోత్రి, కేదారనాథ్ మూత పడనున్నాయి
  • నవంబర్ 6: బద్రీనాథ్ ఆలయం మూసివేయనుంది

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్  ఆన్‌లైన్ ...  ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ప్రారంభమయింది.  60% రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో..  40% ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. మొదటి 15 రోజులు, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇలా..

  • చార్ ధామ్ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం భక్తులు తమ ఇమెయిల్, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, ఓటర్ ID లాంటివి అప్లోడ్ చేయాలి.
  • అలాగే తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, ఈ-పాస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఆన్​లైన్​ సెంటర్స్​హరిద్వార్​.. రిషికేశ్​లలో 20 సెంటర్లు.. వికాస్​ నగర్​ లో 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. 
  •  ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in ద్వారా నమోదు చేసుకోవాలి.  
  • ఆన్​ లైన్​ రిజిష్ట్రేషన్స్​ ప్రక్రియ  మార్చి 1నుంచి ప్రారంభమైంది. 

చార్ ధామ్ ఆలయాల ప్రాముఖ్యత 

యమునోత్రి: చార్ ధామ్ యాత్ర మొదలయ్యే ప్రథమ ఆలయం. దేవి యమునాదేవికి అంకితమైనది. దీనిని టెహ్రీ గర్హ్వాల్ మహారాజా ప్రతాప్ షా నిర్మించారు. ఇక్కడికి చేరుకోవాలంటే జానకి చట్టి నుంచి ఆలయానికి 6 కిలోమీటర్లు నడవాలి. 

గంగోత్రి: గంగాదేవికి అంకితమైన ఆలయం. యాత్రలో రెండో దశలో వస్తుంది. ఈ ఆలయం 3 వేల 48 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 

కేదారనాథ్: శివుడికి అంకితమైన పుణ్యక్షేత్రం. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం హిమాలయ శిఖరాల మధ్యన 3 వేల 584 మీటర్ల ఎత్తులో ఉంటుంది.  పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు.  ప్రస్తుతం ఉన్న దేవాలయ ఆకృతి ఆదిశంకరాచార్యులు వారు రూపొందించారు. 

బద్రీనాథ్: చార్ ధామ్ యాత్రకు ముగింపు ఆలయం. విష్ణువుకు బద్రినారాయణ రూపంలో అంకితం. ఈ దేవాలయంలో వేద యుగం ( సత్య యుగం) 3.3 అడుగుల ఎత్తైన నల్లరాతి దేవత ఉంది. తొమ్మిదవ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని పునరుద్దరించారు.  అయితే గర్భగుడిని మాత్రం అలానే ఉంచారు.  హిందువులకు ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతోంది.