యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యమైన సమాచారం అందించడానికి, గ్రూప్ చాట్, ఫైల్ షేరింగ్, ఫొటో, వీడియో షేరింగ్ కోసం వాట్సాప్‌ని ఎక్కువగా వాడుతుంటారు. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఉండే వాట్సాప్‌కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
వాట్సాప్‌లో పంపే ప్రతీ మీడియా ఫైల్‌కి పరిమితి ఉంటుంది. ఫొటో, వీడియో, ఆడియో, డాక్యుమెంట్స్‌లో ఏది షేర్ చేయాలన్నా పరిమితిని మించి షేర్ చేయలేం. కేవలం మీడియాకే కాదు.. టెక్స్ట్‌కు కూడా లిమిట్ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. చాటింగ్ బార్‌లో 65,536 పదాలకు మించి టైప్ చేయలేం. అంతకన్నా ఎక్కువ పదాలు టైప్ చేసేందుకు ప్రయత్నిస్తే.. ‘లిమిట్ అయిపోయింది. అక్షరాలను పరిమితికి మించి పంపలేరు’అని పాప్ అప్ స్క్రీన్ వస్తుంది.
ఇక డాక్యుమెంట్స్ విషయానికొస్తే వాట్సప్ లో 2జీబీ వరకు షేర్ చేసుకోవచ్చు. ఇది వరకు ఇది 100 ఎంబీ మాత్రమే ఉండేది. ఇక వీడియో ఫైల్ సైజు 16 ఎంబీకి మించి ఉంటే వాట్సప్ లో పంపేందుకు కుదరదు. వాట్సాప్ కెమెరాతో రికార్డు చేసిన వీడియోను సైతం 16 జీబీ సైజు వరకే పంపే వీలుంది.