కొరియోగ్రాఫర్ జానీకి షాక్.. ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీకి షాక్..  ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ  కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈవెంట్స్ పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు జానీ మాస్టర్ పై ఛార్జిషీట్  దాఖలు చేశారు. 

కొరియోగ్రాఫర్​ జానీ  అలియాస్​ షేక్​ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ లో వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్​అసిస్టెంట్ డ్యాన్సర్.. జానీ అత్యాచారంతో పాటు తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 

ALSO READ | Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..

కొరియోగ్రాఫర్ జానీపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైనల్ అయ్యింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను.. మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులకు గురి చేసినట్లు.. బాధితురాలు కంప్లయింట్ చేసింది. దీంతో జానీపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఇప్పటికే బాధితురాలిని రహస్యంగా విచారించి.. అన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు. సెక్షన్ 376  అత్యాచార కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసు నమోదు చేశారు. 

లైంగిక వేధింపులు, ఆరోపణలో అరెస్టై, బెయిల్ పై విడుదలైన కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తేల్చారు.