2024 సంవత్సరానికి సంబంధించి పురుషుల అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ (ICC) శుక్రవారం(జనవరి 24) వెల్లడించింది. ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు చోటు దక్కకపోగా.. ఏకంగా ముగ్గురు పాకిస్థానీలు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్‌గా శ్రీలంక సారథి చరిత అసలంక ఎంపికయ్యాడు.
ఓపెనర్లుగా పాక్, ఆఫ్ఘన్ ప్లేయర్లు
బలమైన జట్టును ఎంపిక చేసిన ఐసీసీ.. ఓపెనర్లుగా పాక్, ఆఫ్ఘన్ ప్లేయర్లు సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను ఎంపిక చేసింది. సైమ్ గతేడాది 9 మ్యాచ్‌ల్లో 64.37 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ మూడు సెంచరీలు చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో చేశాడు. ఇకగుర్బాజ్ 11 మ్యాచ్‌ల్లో 48.2 సగటుతో 531 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 121 . ఇతడూ గతేడాది మూడు సెంచరీలు చేశాడు.
కెప్టెన్‌గా అసలంక
ఐసీసీ 2024 అత్యుత్తమ వన్డే జట్టు నాయకుడిగా లంక సారథి అసలంక ఎంపికయ్యాడు. అతని సారథ్యంలో స్వదేశంలో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను లంక 2-0 తేడాతో చేజిక్కిచ్చుకుంది. అసలంక ఏడాది మొత్తం బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాడు. లంక జట్టును విజయాల బాటలో నడిపాడు. ఇతడు 16 మ్యాచ్‌ల్లో 50.2 సగటుతో 605 పరుగులు చేశాడు.
ALSO READ | Australia Open 2025: ముగిసిన జకోవిచ్ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్
జీరోలైన ఐపీఎల్ హీరోలు
2024 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు చోటు దక్కకపోవడం అభిమానులను నిరుత్సహ పరుస్తోంది. చెప్పుకోవడానికి కోహ్లీ, బుమ్రా, రోహిత్, సూర్య అంటూ నలుగురైదుగురు అగ్రశ్రేణి క్రికెటర్లున్నా.. ఒక్కరికీ చోటు దక్కపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఐపీఎల్‌లో పోరాడి ఆడే మనోళ్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో జీరోలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
2024 ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, అల్లా గజన్‌ఫర్.
Presenting the ICC Men’s ODI Team of the Year 2024 featuring the finest players from around the world 👏 pic.twitter.com/ic4BSXlXCc
— ICC (@ICC) January 24, 2025