చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీ రాని వారికి ఇప్పించే బాధ్యత తనదన్నారు. జూన్ 28వ తేదీ శుక్రవారం రోజున ఆయన వారితో మాట్లాడారు.  కుర్చీ వేసుకుని రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ పదేళ్లు అయిన  పూర్తి చేయలేదని మండిపడ్డారు.  చర్లగూడెం ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వం చేసిన తొందరపాటు చర్యల వల్ల నిర్వాసితులు రోడ్డునపడ్డారని చెప్పారు. 

మహబూబ్ నగర్ జిల్లాలోని ఎదుల ప్రాజెక్ట్ పూర్తి అయితనే ఇక్కడికి నీళ్లు వస్తాయని... కానీ ఇప్పటి వరకు అక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చర్లగూడెం ప్రాజెక్టు కోసం ఆరువేల కోట్లు ఖర్చు చేసిందని.. ఇప్పుడు పనులు ఆపాలంటూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారని..  పనులను అడ్డుకోవడం వల్ల  ఉపయోగము ఏమి ఉండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి భూనిర్వాసితులకు  ఇబ్రహీంపట్న్ంలో లేదా   చింతపల్లి మండలంలో ఇంటి స్థలాలు ఇప్పించాటానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.